TRINETHRAM NEWS

Community contact program in Brahmana Palli village under Antargam Police Station

రామగుండం పోలీస్ కమిషనరేట్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గల బ్రాహ్మణ పల్లి గ్రామంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,ఐజీ అదేశాల మేరకు, గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్ పర్యవేక్షణలో రామగుండం సీఐ అజయ్ బాబు అంతర్గా ఎస్ఐ వెంకట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడమైనది. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి గ్రామంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , గ్రామంలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు.

సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీ లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మ హత్యలు, లైంగిక వేదింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై మరియు వివిధ చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ మరియు షీ టీమ్ , డయల్ 100 గురించి అవగాహన కల్పించడo జరిగింది.

ఇట్టి కార్యక్రమం లో రామగుండం సీఐ అజయ్ బాబు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, అంతర్గం ఏస్.ఐ వెంకట్, రామగుండం ఎస్ఐ సతీష్, గోదావరిఖని ఎస్ఐ లు రమేష్, ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు హాజరైనారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Community contact program in Brahmana Palli village under Antargam Police Station