TRINETHRAM NEWS

తేదీ : 20/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ మిషన్ వాత్సల్యంతో శిశు క్షేమం, సంక్షేమం , గ్రామ వార్డు స్థాయి కమిటీలు క్రియాశీలం కావాలి అని 15 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలి అని, కమిటీలకు మరియు డివిజన్ స్థాయిలో నిర్వహణ , అదేవిధంగా జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న అవసరాలు గల చిన్నారుల క్షేమం, సంక్షేమ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి మిషన్ వాత్సల్యను లక్ష్యాలుగా, అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన గ్రామ వార్డు స్థాయి కమిటీలు కావాలని చెప్పడం జరిగింది. ఆమె అధ్యక్షతన కలెక్టర్ రేట్ లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం ప్రారంభించారు.
అదేవిధంగా సంరక్షణ చట్టాలు, కుటుంబ అథారిత సంరక్షణకు , ప్రోత్సాహం , సంస్థాగత పథకాలు తదితర అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ చైర్మన్ గా గ్రామ వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు అయ్యాయి. అదేవిధంగా డివిజన్ స్థాయిలో వర్క్ షాప్ లు నిర్వహించాలని, బాలల హక్కుల పరిరక్షణ , వివాహాల నిర్మూలన, విద్యా సాధికారత గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జి పి డి పి) లో శిశు మద్దతు కార్యకలాపాలు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు తదితరాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు.

సరైన విద్య అందడం కూడా ముఖ్యమని ఈ విషయంలో విద్యాశాఖ, సర్వ శిక్ష అభియాన్ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దుష్పరిణామాలపై అది బాలికను విద్యా , ఆరోగ్యం , అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి కలలను సహకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని , భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిణామాలపై ప్రజల్లో పెద్దవిత్తున అవగాహన కల్పించాలన్నారు. బాలికల విద్య ఆర్థిక సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవలు సంస్థ (డి ఎల్ ఎన్ ఎ) కార్యదర్శి కే వి. రామకృష్ణయ్య, డీసీపీ కె జీ వీ సరిత, జెడ్ పి , సీఈవో వై. కన్నమనాయుడు, ఐ సి డి ఎస్ పి డి .లక్ష్మి, జిల్లా శిశు సంరక్షణ అధికారి యం. రాజేశ్వరరావు, గిరిజన సంక్షేమ అధికారి జి. ఉమామహేశ్వరరావు, ఏసిపి కె. లలిత కుమారి, సాంఘిక సంక్షేమ అధికారి కే యస్ . శిరోమణి, లేబర్ కమిషనర్ సిహెచ్ .ఆషారాణి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ దా. పద్మావతి , జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యన్. శ్రీనివాసరావు, ప్రొహిబిషన్ ఆఫీసర్ టి. జ్యోతి, డిసిపియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Committees should be active