TRINETHRAM NEWS

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు..

శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల ప్రసాద్‌ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు, దివ్య బలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ మళ్ళిస్తూ సీపీ ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. గుణదల కొండ వరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది.