TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

ది. 9-3-2024 న మేడ్చల్ కండ్లకోయలో నూతనంగా నిర్మించబోతున్న ఐటీ పార్క్ శంకుస్థాపన మరియు భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ రేవంత్ రెడ్డి విచేయుచున్నందున ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి , కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ గార్ల సమక్షంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విచేయుచున్న భారీ బహిరంగ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు 4 గ్యారంటీలు అమలు అయ్యాయని త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన వారికి ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.