
*ప్రతి ఫ్లోర్ కు రెండు మంచి నీటి వాటర్ ట్యాప్ ల ఏర్పాటు
*త్రాగునీటికి వాటర్ ట్యాప్ లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఫిబ్రవరి-22: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మిషన్ భగీరథ ద్వారా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన త్రాగునీటి వాటర్ ట్యాప్ లను కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు సిబ్బంది వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో త్రాగునీటి వాటర్ ట్యాప్ లను ప్రారంభించారు
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఒక యూవి ప్యూరిఫైర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, మిషన్ భగీరథ బల్క్ నీటి సరఫరాకు అనుసంధానం చేశామని, కలెక్టరేట్ లోని ప్రతి ఫ్లోర్ లో రెండు వాటర్ ట్యాప్ లను ఏర్పాటు చేశామని అన్నారు
యూవి ప్యూరిఫైర్ ప్లాంట్ ద్వారా మిషన్ భగీరథ బల్క్ నీరు శుద్ది చేసి ట్యాప్ లో స్వచ్ఛమైన జలం మనకు వస్తుందని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని అన్ని శాఖలు అధికారులు, సిబ్బంది త్రాగు నీటి ట్యాప్ లను వినియోగించుకోవాలని, ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి త్రాగునీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, ఏ.ఓ.శ్రీనివాస్, అందరూ జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
