
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. గుండ్లపల్లి డిండి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల లో డ్రైనేజీ సమస్య లు, సోలార్ లైట్ ల సమస్యలు పరిష్కరించినందుకు తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రిన్సిపాల్ ఆదేశించారు.
గురువారం రాత్రి ఆమె నల్గొండ జిల్లా గుండ్లపల్లి డిండి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాల పరిసరాలను వంటగదిని స్టోర్ రూమ్ తరగతి గదులను ఆమె తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనానికి సంబంధించిన వంట సరుకులను తనిఖీ చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ 5 6 తరగతి గదులలోకి విద్యార్థినీలతో ముఖాముఖి మాట్లాడి వారి విద్య పరిజ్ఞానాన్ని ప్రశ్నలు జవాబుల ద్వారా పరీక్షించారు. విద్యార్థినీలు బాగా చదువుకోవాలని వృధా చేయవద్దని విద్య ద్వారానే సమాజంలో స్థానాన్ని పొందవచ్చు అని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మంచి జవాబులు విద్యార్థులకు చాక్లెట్ లను పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శిరీష ఉపాధ్యాయులు ఉన్నారు. అంత కు ముందు జిల్లా కలెక్టర్ గుండ్లపల్లి డిండి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉండడం. 20 నిమిషాల తర్వాత వాచ్మెన్ వైద్య ఆరోగ్య కేంద్రానికి రాగా, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఎవరు లేక లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాచ్మెన్ ను విధులనుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ఇతర సిబ్బంది కి మెమోలు జారీ చేయాలని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
