Trinethram News : పెద్దపల్లి జిల్లా :జనవరి 17
నిత్యం అధికార కార్యక్రమా లతో బిజీబిజీ ఉండే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు.
కూలీలతో కలిసి నాట్లు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీ శివారులోని చందపల్లిలో బుధవారం చోటు చేసుకుంది
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు.
చందపల్లిలో వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతు లను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవు తున్న ఇబ్బందులు, తదితర అంశాలపై రైతులను వివరా లు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కూలీలతో కలిసి పొలంలో వరి నాట్లు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి అలివేణి, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు..