TRINETHRAM NEWS

782 పందెం బరులు ఉన్నట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి..

ఈసారి హైటెక్ హంగులతో కోడిపందాలు జరుగుతున్నాయి. భారీ ఎల్ఈడి స్క్రీన్లు, యాంకర్ల, బౌన్సర్లు హడావుడితో అత్యంత కట్టుదిట్టంగా పందాలు వేస్తున్నారు..

రాత్రి 10 గంటల వరకు ఎల్ఇడి లైట్ ల వెలుతురులో పందాలు సాగుతున్నాయి…

ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పందాలకు పోటీగా పై పందాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 40 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి.

పందెం రాయుళ్లు వారి స్థాయిని బట్టి 10వేల నుంచి 10 లక్షల వరకు పందాలు కడుతున్నారు..

కోడి పందాలు చట్టరీత్యా నేరమని హైకోర్టు ఆదేశించినా రాజకీయ నేతల అండదండలతో పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు…

పైపెచ్చు సంప్రదాయ క్రీడలో ఇదొక భాగమని పందెం రాయుళ్లు వాదిస్తున్నారు….