
తేదీ : 03/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని , ఆ దిశగా ఎమ్మెల్యే రాము సూచనలతో గుడివాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను త్వర గతిన పూర్తి చేస్తామని కృష్ణాజిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రబ్బాని అనడం జరిగింది. టిడిపి నాయకుడు వెనిగండ్ల. రామకృష్ణ,(నాని), ఎమ్మెల్యే మైనార్టీ పెద్దలతో కలిసి ఓల్డ్ బైపాస్ రోడ్డులోని అంజుమన్ భవనంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని, మునిసిపల్ అధికారులు, వెనిగండ్ల. రామకృష్ణకు వివరించారు.
పెద్దల విజ్ఞప్తుల మేరకు భవనంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మునిసిపల్ అధికారులకు మైనార్టీ వెల్పేర్ ఆఫీసర్లు పలు సూచనలు చేశారు. అనంతరం బైపాస్ రోడ్డు లోని షాది ఖానాభవన పరిసరాలను పరిశీలించిన రబ్బాని భవన నిర్మాణానికి అంచనాలు రూపొందించి తమకు చెప్పవలసిందిగా మున్సిపల్ అధికారులకు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుండి గుడివాడలో ముస్లిం వర్గాల అభ్యున్నతికి ఎమ్మెల్యే రాము చేస్తున్న కృషి ఎనలేనిదని, మైనార్టీ పెద్దలన్నారు. మైనార్టీల సుదీర్ఘ సమస్యల పరిష్కారానికి సచివాలయంలో ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలకు ముస్లిం ల తరఫున ధన్యవాదాలు చేస్తున్నామని మైనార్టీ పెద్దలు పేర్కొన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని ఎమ్మెల్యే తప్పకుండా నెరవేరుస్తాడని, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో జరగనున్నట్లు ఆయన చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా మున్సిపల్ డి .ఈ సతీష్ చంద్ర, ఏఈలు రాజేష్, శివాజీ, టిడిపి మైనార్టీ నాయకులు షేక్ జానీ, ఇబ్రహీం, సయ్యద్ . మున్వర్, జబీన్. మహమ్మద్ రఫీ, షేక్. సర్కార్, రహీం, రబ్బాని కరి ముల్లా, టిడిపి నాయకుడు పట్టపు చిన్న, పలువురు మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
