TRINETHRAM NEWS

Trinethram News : నెల్లూరు, తేదీ – 13-01-2024

సీఎంఆర్ఎఫ్‌ చెక్కును అందజేసిన వి.పి.ఆర్‌

ఈ రోజు పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు.. అల్లూరు మండలం వెస్ట్‌ గోగులపల్లి గ్రామానికి చెందిన
దాసరి సాయికుమార్‌ వైద్య ఖర్చుల నిమిత్తం బాలుడి తండ్రి దాసరి గోపాల్‌ కు 80 వేల రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందించారు. వివరాల మేరకు.. వెస్ట్‌ గోగులపల్లి గ్రామానికి చెందిన దాసరి సాయికుమార్‌ అనే బాలుడు ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ విషయాన్ని ఎంపీగారు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. 80 వేల రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును విడుదల చేశారు. ఈ చెక్కును శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, తన సోదరులు శ్రీ వేమిరెడ్డి కోటారెడ్డిగారి ఆధ్వర్యంలో తన నివాసంలో సదరు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. దాంతో వారు ఎంపీగారికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో బాలుడి తండ్రి గోపాల్‌, పుచ్చలపల్లి నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.