
CM Revanth’s visit to Palamuru today
Trinethram News : Telangana : Jul 09, 2024,
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. జిల్లా పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ఇతర నేతలతో భేటీ అవుతారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు.
