TRINETHRAM NEWS

కమీషనరేట్ లో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి హోంగార్డుల క్షీరాభిషేకం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హోంగార్డుల రోజువారి వేతనం 1000 కి పెంపు చేయడంతో పాటు, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల ఎక్స్ గ్రేషియా, విక్లీ పరేడ్ అలవెన్స్ ను రూ. 200కు పెంచడంతోపాటు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 2025 జనవరి 1 నుంచి హోంగార్డులకు వర్తింప చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి, ఈ నెల 6 న హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ హోం గార్డ్స్ ఆఫీస్ వద్ద హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

కార్యక్రమంలో హోంగార్డు ఆర్ ఐ మల్లేశం, పెద్దపల్లి జోన్ హోం గార్డ్స్ ఇంచార్జి హెడ్ కానిస్టేబుల్ మనోహర్, హోం గార్డ్స్ పిఎల్ సి సత్యనారాయణ, కుమార్, బ్రమ్మచారి, శ్రీనివాస్,నర్సయ్య, చంద్రమౌళి, రాము పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App