Trinethram News : హైదరాబాద్: బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్ కుటుంబసభ్యులను కలిసినంత ఆనందమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని బంజారా భవన్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.
‘‘1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీది. దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని నినదించారు. మీ ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలీడేగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణకు రూ.కోటి కాదు.. రూ.2కోట్లు విడుదల చేస్తున్నాం. తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా.
రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మించే బాధ్యతను మేం తీసుకుంటాం. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మా ప్రభుత్వానిదే. విద్యుత్, తాగునీరు.. ఇలా ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది. ఆ బాట పట్టి.. సంత్ సేవాలాల్ మార్గంలో నడవండి. మీ కోసం.. మీ అభ్యున్నతికి కష్టపడే ప్రభుత్వమిది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయండి’’ అని రేవంత్ కోరారు….
బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్ కుటుంబసభ్యులను కలిసినంత ఆనందమని : సీఎం రేవంత్‌రెడ్డి
Related Posts
ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR
TRINETHRAM NEWS ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR Trinethram News : Telangana : Nov 09, 2024, ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలని.. సమాజాన్ని నిలబెట్టాలని BRS అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పాలకుర్తి…
Harish Rao : ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది
TRINETHRAM NEWS ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది Trinethram News : Telangana : ఈ ప్రభుత్వం కొనడం లేదని రూ.1700, 1800 ధాన్యం దాళరులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది రూ.2320 మద్దతు ధర, రూ.500 బోనస్ మొత్తం…