TRINETHRAM NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చండ్రుగొండ మండలం

త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర, ముఖ్య మంత్రి వర్యులు, ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా బెండాలపాడు, పంచాయతీ బాలికుంట గ్రామం లో బీసీ సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల హామీలో చెప్పిన విధంగా బీసీ కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. విద్యా మరియు ఉపాధి రంగాలలో ఇంతటి సముచిత స్థానాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి.మరియు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ.కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు కారం చిట్టిబాబు, అశ్వరావుపేట సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి, భద్రాద్రి జిల్లా దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్, గ్రామ శాఖ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సపావత్ రాజేష్, ప్రధాన కార్యదర్శి ఒర్సు రామకృష్ణ, మాజీ సర్పంచి వీసం రాములు, మాజీ ఎంపీటీసీ కారం వెంకటేశ్వర్లు, గోగుల తిరుమలరావు, రాయల నరేష్, చల్లా ఏడుకొండలు, చల్లా నరసింహారావు , దేవుళ్ళ అయోధ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM. Revanth Reddy, Palabhishekam