TRINETHRAM NEWS

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ సమావేశం

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం

డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ హాజరయ్యే అవకాశం

ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా

ఎమ్మెల్యేల జడ్చర్ల సమావేశంపై చర్చించే అవకాశం

Trinethram News : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

తొలుత ఎమ్మెల్యేలతో రేవంత్, దీపాదాస్ సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం అవుతారు. సమావేశంలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా పాల్గొంటారు. దీనివల్ల వారి మధ్య సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్.. అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్చర్లలో ఎమ్మెల్యేల సమావేశం విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth, Deepadas Munshi meeting