TRINETHRAM NEWS

Nara Lokesh : సీఎం షేరింగ్ లేదు – లోకేష్..ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కీల‌క కామెంట్స్

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి సంయుక్తంగా పోటీ చేస్తాయ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతామ‌ని, తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం ప‌ద‌వి షేరింగ్ లేద‌ని పేర్కొన్నారు నారా లోకేష్. అయితే ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీద చంద్ర‌బాబు నాయుడు గారే నిర్ణ‌యం తీసుకుంటార‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.
ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన కూట‌మి గెలిస్తే మొత్తంగా అధికారం, నిర్ణ‌యాలు తీసుకునే శ‌క్తి త‌మ చేతిలోనే ఉంటుంద‌న్నారు నారా లోకేష్.

ఇంకా ఎన్నిక‌లే కాలేదు అప్పుడే సీట్ల షేరింగ్ , సీఎం ప‌ద‌విపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌కలం రేపుతోంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో 175 సీట్లు ఉన్నాయి. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతోంది వైసీపీ చీఫ్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఈసారి తీవ్ర‌మైన ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఒంటెద్దు పోక‌డ‌లతో పాటు చాలా మంది ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇచ్చేందుకు నిరాక‌రించారు.