Trinethram News : అమరావతి :మార్చి 13
సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించను న్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు.
అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై, లబ్ధిదారుల ఖాతాల్లో ఈబీసీ నేస్తం నిధులు జమ చేయను న్నారు. అనంతరం తిరిగి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు…..