TRINETHRAM NEWS

రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.

మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి లోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు.

అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసగించనున్నారు.

మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు అని సమాచారం.