TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆళ్లగడ్డలో ప్రారంభమైంది. ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి ప్రజలతో ఇంటరాక్షన్‌కు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బస్సు యాత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అటుగా వస్తున్న అంబులెన్స్‌కు ముఖ్యమంత్రి జగన్ దారి ఇచ్చారు. పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ.. అంబులెన్స్ సజావుగా వెళ్లేలా జగన్ సిబ్బందికి సూచనలిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.