
వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
Trinethram News : తిరుపతి: తిరుపతి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
తిరుపతి పద్మావతి పురంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విషయం తెలియడంతో వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అభినయ్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు.
పద్మావతీ పురంలోని భూమన నివాసం వద్దకు వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుని అభినయ్ రెడ్డికి మద్దతు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
