వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు
Trinethram News : క్రిమినల్స్, రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరైనా రౌడీలు మీ ఇష్టప్రకారం చేస్తే అదే చివరి రోజు కావాలని మా ఆకాంక్ష. ఆ విధంగా మా పోలీస్ వ్యవస్థను తయారు చేస్తాం. గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, స్మగ్లింగ్ చేస్తూ మృగాలుగా మారుతున్నారు. ఆడబిడ్డలను లైంగికంగా హింసించి హత్య చేస్తున్నారు. ప్రతి ఒక్క కేసును సవాల్‌గా తీసుకుంటాం. శాశ్వత పరిష్కారం చూపిస్తాం.’ అని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App