‘ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు..
సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. వంద రోజుల పనిదినాలు సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్‌ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు.
పల్లె పండగలో 14.8 శాతమే పనులు చేశారన్నారు. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తుచేశారు. అల్లూరి జిల్లాలో 54 శాతమైతే.. మరో జిల్లాలో 1.6 శాతమే పనులు కావడంపై సీఎం ప్రశ్నించారు. పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు..
”జల్‌జీవన్ మిషన్‌ను గత ప్రభుత్వం దెబ్బతీసింది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులుంటే వారికీ పింఛన్ ఇవ్వాలి. సదరం ధ్రువీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలి. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం. విజయవాడ, గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి. పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలుండాలి. ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి. స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి. స్వచ్ఛత-శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లింది. చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App