TRINETHRAM NEWS

పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం ముళ్ళపూడి వెంకటేశ్వరరావు

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం

ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా…….
ఈ సమయంలో పిల్లలని శారీరకంగా. మానసికంగా దృఢంగా తయారు చేయడం మన బాధ్యత. ఈరోజు నుండి పరీక్షలు పూర్తి అయ్యే వరకు సమయం చాలా విలువైనది. పిల్లలతో ప్రేమగా మరియు శాంతియుతంగా మాట్లాడండి వారు ఒత్తిడికి గురికాకుండా మంచి స్నేహితుడిగా మెలగండి.
పరీక్షలు పూర్తి అయ్యే అంతవరకు పిల్లలకు చదువు తప్ప వేరే పనులు చెప్పకండి. సెల్ ఫోన్లు టీవీలకు, దూరంగా ఉంచి వారికి చదువుకునే వాతావరణాన్ని కల్పించండి. పిల్లలకు పాలు. పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి బయట ఆహారానికి దూరంగా ఉంచండి.
పిల్లల్ని నిరంతరం ప్రోత్సహించండి ఎట్టి పరిస్థితుల్లో ఇతర పిల్లలతో పోల్చి నిరుస్తహ పరచకండి. సరియైన సమయానికి నిద్రపోయి తగినంత విశ్రాంతి తీసుకునే విధంగా చూడండి. ఉన్నత ఫలితాలను పొందడానికి నైపుణ్యం అత్యంత అవసరం వాటిని ప్రోత్సహించండి.
పిల్లలు పరీక్షలు రాయడానికి చక్కగా సిద్ధమయ్యారు. ఉపాధ్యాయుల కు మంచి ఫలితాలను సాధించడానికి తగినంత కృషి చేశారు. కాబట్టి వారు ప్రశాంతంగా మరియు ఆత్మ విశ్వాసముతో పరీక్షలు రాసేలా చేయడం ప్రస్తుతం మనందరి బాధ్యత పిల్లల జీవితాలలో పరీక్షలు ప్రధానమైనవి, కానీ అవే జీవితం కాదు. ఇట్లు తెలంగాణ ఉద్యమ నాయకులు సేవా రత్న అవార్డు గ్రహీత దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముళ్ళపూడి వెంకటేశ్వరరావు. తెలంగాణ రాష్ట్ర 10,వ తరగతి. పరీక్షలు రాస్తున్న పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Class 10 exams have