సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కోసం నిర్ణయం చేయాలి సిఐటియు
తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రామగుండం1, ఏరియా బ్రాంచి కమిటీ సమావేశం ఆరెపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది, ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల ప్రధానమైన సమస్యలపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తామని ఆలయన్స్ లపై ఇన్కంటాక్స్ కార్మికులకు తిరిగి చెల్లిస్తామని మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈరోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సొంతింటి పథకం అమలు కోసం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు, మారుపేర్ల సమస్యతోటి అనేక మంది కార్మికులు విజిలెన్స్ పెండింగ్ కేసులతో వారి పిల్లలకు ఉద్యోగాలు రాక ప్రస్తుత జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు, అలవెన్స్లపై ఇన్కమ్ టాక్స్ కోల్ ఇండియాలో కార్మికులకు తిరిగి చెల్లిస్తున్నప్పటికీ సింగరేణిలో ఇవ్వడం లేదని దీంతో కార్మికుల జీతాలలో పెద్ద ఎత్తున ఇన్కంటాక్స్ పేరుతోటి రికవరీ జరుగుతున్న పట్టించుకునే పరిస్థితి లేదని తక్షణమే ఈ పై సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసి పరిష్కరించవలసిందిగా ఇంజనీరింగ్ కాలేజ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తున్నామన్నారు, ఈ సంవత్సర పరిష్కారం కోసం ఈరోజు నుండి డిసెంబర్ 31 వరకు దశలవాళి ఆందోళన పోరాటంలో భాగంగా పెద్ద ఎత్తున పోస్టర్లు కరపత్రాలు ముద్రించి కార్మికులలో చైతన్యం తీసుకురావడంతో పాటు సొంతింటి పథకం అమలు కోసం సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించడం జరిగిందని అలాగే కార్మికుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడానికి నిర్ణయించామన్నారు, పై కార్యక్రమాలను కార్మికులు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, జె గజేంద్ర, పి రాజేశ్వర చారి, ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్, పి శ్రీనివాసరావు, దాసరి సురేష్, నంది నారాయణ జంగాపల్లి మల్లేష్, పి సమ్మయ్య, ఈ వెంకటేశ్వర్లు, ఈ సాగర్, పి శశికిరణ్, జి శివరామకృష్ణ రెడ్డి, శ్రావణ్ కుమార్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App