TRINETHRAM NEWS

CITU foundation day celebrations

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని సిఐటియు ఆఫీసులో సిఐటియు 54వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా, ముందుగా 11గనిలో 29న నైట్ షిఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన ఇజ్జగిరి ప్రతాప్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, అనంతరం సరళీకృత ఆర్థిక విధానాలు, సవాళ్లు, కార్మిక వర్గ కర్తవ్యం అనే అంశంపై “సెమినార్” ఆరెపల్లి రాజమౌళి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ సెమినార్ కు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి హాజరై మాట్లాడుతూ 1970 మే 30న ఏర్పడిన సిఐటియు ఈ దేశంలో ఐక్యత పోరాటం అనే నినాదంతో అనేక కార్మిక సామాజిక ఉద్యమాలు నిర్వహించి దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా అవతరించిందని అన్నారు.

అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించి కార్మిక సంఘాలకు పెద్దన్న పాత్రగా ఈ దేశంలో పోషించిందని అన్నారు. 1991లో ఏర్పడిన సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు అయ్యేంతవరకు రైతాంగం చేసిన పోరాట స్ఫూర్తి తో నాలుగు లేబర్ కోడ్ లు రద్దుకై కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్, వి నాగమణి, ఆరేపల్లి రాజమౌళి, దాసరి సురేష్, నంది నారాయణ, ఏ శంకర్, నవీన్ కుమార్, సింగరేణి పర్మినెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్మికులు బిల్లింగ్ వర్కర్స్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CITU foundation day celebrations