TRINETHRAM NEWS

చలి ఉత్సవాలు ఎవరి కోసం ఎందుకోసం ఏం వెలగపెట్టారని ఉత్సవాలు
(సురేంద్ర కిల్లో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

అరకులోయ, త్రినేత్రం న్యూస్, జనవరి 27.

ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఆదివాసి నాయకుడూ సురేంద్ర కీల్లో మాట్లాడుతు. అరకు ఉత్సా వాలు పేరుతో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు అరకులో ప్రభుత్వం నిర్వహిస్తున్న చలిఉత్సవాలు” నిర్వహిస్తు కోట్లు డబ్బులు ఖర్సుకు సిద్ధం అవుతుంది ఆదివాసులకు కావాల్సింది చలి ఉత్సవాలు కాదని, ఆదివాసి సాంస్కృతిక, దింసా ఉత్సవాలు నిర్వహించాలని, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తుంది చలి ఉత్సవాలు పేరుతో టూరిస్ట్ లకు కోట్లు ఖర్చులు పెట్టే కన్న చలికాలంలో చలికి అల్లాడుతున్న 120 సంక్షేమ హాస్టల్ లో సదువుతున్న 50 వేల మంది ఆదివాసీ విద్యార్ధిని,విద్యార్థులకు చలి దుప్పట్లు పంపిణీ చేయాలని, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర డిమాండ్ చేశారు.
టూరిజంలో వచ్చేఆదాయం స్థానిక ఆదివాసి అభివృద్ధికి నిబంధన ప్రకారం 25 శాతం నిధులు ఖర్చు పెట్టాలని ఉన్నఖర్చు పెట్టాకుండ చలి ఉత్సవాలు కోసం టూరిస్ట్ లను కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శించారు.
ఆదివాసీల కలలు, సాంస్కృతి రక్షణకు దింసా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.అరకులో ప్రభుత్వం నిర్వహిస్తున్న చలి ఉత్సవాలు వలన ఆదివాసి కి ఒరిగేదేమీ లేదని,చలి ఉత్సవాలపేరుతో కోట్లు డబ్బులు వృథా చేయడమేనని విమర్శించారు.వివిధ టూరిజం శాఖల్లో సుమారుగా 20 కోట్లు వరకు ఆదాయం వస్తున్న స్థానిక ఆదివాసుల విద్యా వైద్యం మౌలిక వసతులు కోసం ఖర్చు పెట్టకుండా టూరిస్టులకు కోట్లు ఖర్చు పెట్టడానికి ఆదివాసి గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది, గిరిజన సాంస్కృతి రక్షణ,ఆదివాసీలకు ఉపాధి పొందే విధంగా టూరిజం అభివృద్ధి చెయ్యాలని,కానీ ఆదివాసుల సాంస్కృతి నాశనం చేసే విధంగా, టూరిజం అభివృద్ధికి బినామీ పేర్లతో పెద్దపెద్ద టూరిజం లాడ్జీలు, రిసార్ట్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి 1/70 చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది.

టూరిజం శాఖలో అన్ని ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకే కేటాయించాలని, టూరిజం శాఖలో వస్తున్న ఆదాయం ఖర్చు పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నది,ఈ కార్యక్రంలో ఏస్,ధర్మాన పడల ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామ రాజు జిల్లా అధ్యక్షుడితో పాటు జిల్లనాయకులు జి.బుజ్జిబాబు,కె.బొజ్జయ,ఏస్,చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App