
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15 : కూకట్పల్లి నియోజక వర్గం వివేక్ నగర్ లో నివాసం ఉండే గైక్వాడ్ లక్ష్మణ్(55) S/o తులసీరావు లివర్ ఇన్ఫెక్షన్ వలన అత్తాపూర్ లోని జోయి హాస్పిటల్ లో చేరి చికిత్స చేయించుకోవడం జరిగింది. వారు కోలుకున్న తరువాత వారు కూకట్పల్లి లోని కార్యాలయం లో సంప్రదించగా వారికి కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది కి దరఖాస్తు చేయించడం జరిగింది..
వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,25,000 రూపాయలు మంజూరు అయినవి..
ఆ చెక్కును గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కార్యాలయం లో గైక్వాడ్ లక్ష్మణ్ కి కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ అందజేయడం జరిగింది..
ఈ సందర్భంగా గైక్వాడ్ లక్ష్మణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి, బండి రమేష్ కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావుకి కృతజ్ఞతలు తెలియజేశారు…. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, లక్ష్మయ్య, రమణ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
