TRINETHRAM NEWS

హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు.

కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామని చెప్పారు.

బెల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందని సీఎం వెల్లడించారు.

ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రోను విస్తరిస్తామని తెలిపారు.