TRINETHRAM NEWS

ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది..

నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారు…

మీ అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిది

దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది..

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తాం..

ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి మీదుగా మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మాపై ఉంది.

మురికి కూపంగా మారిన మూసీ పరివాహక ప్రాంతాన్ని రూ.40 నుంచి 50 వేల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం

లండన్ థెమ్స్ నదీపరివాహక ప్రాంతంలా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం

వైబ్రాంట్ తెలంగాణ 2050లో భాగంగా త్వరలోనే 55 కి.మీ మేర మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం

354 కి.మీ ల రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోపల సబర్బన్ హైదరాబాద్ కింద రేడియల్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తాం.

అందరి సలహాలు, సూచనలతో వైబ్రాంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నాం.

హైదరాబాద్ లో మెట్రో విస్తరణ అడ్డుకోవాలని చూసేవారిని ఈ వేదికగా హెచ్చరిస్తున్నా

హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డు పడొద్దు..

హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి
నగర బహిష్కరణ శిక్ష విధించాలి.