TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి, ఏప్రిల్ 7 : రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా సంబేపల్లె మండలం యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ తీవ్రంగా గాయపడ్డారు.

రాయచోటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రమ మృతి దురదృష్టకరమని కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురికి అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister condoles death