TRINETHRAM NEWS

Trinethram News : చీరాల: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్సీసి డైరెక్టరేట్ గుంటూరు గ్రూప్ సంయుక్త ఆదేశాల ప్రకారం శనివారం చీరాలలోని 23వ ఆంధ్ర ఎన్సీసి బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసి-సి సర్టిఫికెట్ ఎగ్జామ్ నిర్వహించామని గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్ ఎం చంద్రశేఖర్ తెలిపారు.

చీరాల విఆర్ యస్ వై ఆర్ ఎన్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సి సర్టిఫికెట్ పరీక్ష కేంద్రాన్ని అయన పరీశీలించారు.ఈ పరీక్షకు కు చీరాల, ఒంగోలు,తెనాలి ఎన్సీసి యూనిట్ ల నుండి సుమారు 404 మంది మూడవ సంవత్సరం ఎన్సీసి పూర్తి చేసుకున్న క్యాడేట్స్ హాజరయ్యారని తెలిపారు.
ఈ పరీక్ష గ్రౌండ్ ప్రాక్టికల్ టెస్ట్, రాత పరీక్ష అని రెండు విభాగల్లో జరుగుతుందని అన్నారు. క్యాడేట్స్ కు గ్రౌండ్ టెస్ట్ లొ భాగంగా డ్రిల్, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్ మరియు బ్యాటిల్ క్రాఫ్ట్ మొదలయినా అంశాలలో కాడేట్స్ యొక్క నైపుణ్యతను పరీక్షిస్తారని వివరించారు.
ఈ పరీక్షకు ప్రీసిడింగ్ ఆఫీసర్ గా గుంటూరు నుండి 25వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సింధు వ్యవహారిస్తారని అన్నారు..
ఆదివారం క్యాడేట్స్ కు రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలొ 23వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సునీల్ గౌతమ్, ఆర్మీ అధికారులు, వివిధ కళాశాలల ఎన్సీసి అధికారులు,సివిల్ స్టాఫ్, క్యాడేట్స్ పాల్గొన్నారు.