అయోధ్య రామమందిరం నిర్మాణంపై కీలక విషయాలను వెల్లడించారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్
9 దేశాలు సమయం చెప్పే గడియారం రాముడికి కానుక భక్తులు తూర్పు నుంచి ఆలయంలోకి ప్రవేశించి దక్షిణం నుంచి బయటకు వస్తారు. భక్తులు ఆలయంలోకి వెళ్లాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర పద్ధతిలో నిర్మించాం. 380 మీటర్ల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించాం. జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించగా, ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 పిల్లర్లు, 44 తలుపులు ఉంటాయి. 14 అడుగుల వెడల్పుతో 732 మీటర్ల వైశాల్యంతో ఆలయ గోడలను నిర్మిస్తున్నాం. ఈ తరహా నిర్మాణం కేవలం దక్షిణాదిలోని కనిపిస్తోంది. ఈ నిర్మాణాన్ని సూర్యుడు, అమ్మవారికి, గణేషుడు, శివుడికి అంకింతం చేస్తున్నాం.”
*ఐదు సంవత్సరాలు కష్టపడి 9 దేశాలకు సంబంధించిన సమయాన్ని తెలిపేలా ఓ గడియారాన్ని రూపొందించాడు
జై శ్రీ రామ్