
Trinethram News : Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి..? ఎంత ఖర్చవుతుంది..? ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవే పైనే వెళ్తుంటారు. ఈ రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయ్యారు. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారి.. నల్లమల ఫారెస్ట్ అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లనుంది. ఇందులో 62 కిలోమీటర్ల దూరం రెండు లేన్ల ఘాట్లతో ఇరుకుగా ఉంది.
దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవతున్నాయి. ఈ ప్రాంతంలో టర్నింగ్‌ల కారణంగా.. వన్యప్రాణులు కూడా యాక్సిడెంట్ బారిన పడుతున్నాయి. దానికి తోడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఈ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
