TRINETHRAM NEWS

నవంబర్ 21న గోదావరిఖని లో జరిగే మతోన్మాద వ్యతిరేక సదస్సును జయప్రదం చేయండి.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో వామ పక్ష పార్టీల సమావేశం జరిగింది.
రామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో 2024 నవంబర్ 21న. గోదావరిఖని లో జరిగే మతోన్మాద వ్యతిరేక సదస్సును జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా సిపిఐ.జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం,సీపీఎం. జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సీపీఐ(ఎం ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న,సీపీఐ (ఎం ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సీపీఐ (ఎం ఎల్)న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండేటి మల్లేశం.లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తుందని, భారత రాజ్యాంగాన్ని ఖూనిచేస్తూ,
ప్రజల మధ్య భావోద్వేగాలనీ
రెచ్చగొడుతుందని వారు అన్నారు.
మతం వ్యక్తిగతమని, కానీ మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని వారు అన్నారు.
కులం ,మతం, ప్రాంతం పేరుతో పాలక వర్గ పార్టీలు ప్రజల ఆలోచనలు వక్రమార్గం పట్టిస్తున్నాయని అన్నారు.
తెలంగాణ లోని మానస పార్టీలు కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయడానికి మతసామరాస్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రజా సమస్యలు, పౌర హక్కులు, లౌకిక ప్రజాస్వామ్యం, సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం, నిరంకుశ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మతోన్మాదం,కులో న్మాదం, రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని చాటి చెప్పాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల పార్టీల పిలుపులో భాగంగా గోదావరిఖనిలో జిల్లా వానపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే మతోన్మాద వ్యతిరేక ప్రదర్శన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ యొక్క సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు గౌతం గోవర్ధన్, చంద్రశేఖర్, వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, ఐ కృష్ణ,ఈ నరేష్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, ఎం దుర్గయ్య,ఎడ్ల రవికుమార్, వైకుంఠం దితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App