అంగరంగ వైభవంగా క్రిస్మస్ సంబరాలు..
ముత్తారం మండలం
త్రినేత్రం న్యూస్ ఆర్ సి
ముత్తారం మండల కేంద్రంలోని కల్వరి క్రీస్తు ప్రార్థన మందిరంలో పాస్టర్ చెరుకుపల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండగ వేడుకను ఘనంగా జరుపుకున్నారు . ఈ వేడుక సందర్భంగా ప్రార్థన మందిరాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్ చెరుకుపల్లి సుదర్శన్ ప్రత్యేకమైన కేక్ కట్ చేసి సంఘ సభ్యులకు అందజేశారు.
ఈ వేడుకను ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు సంగీత వాయిద్యాలతో పాటలు పాడుతూ సహపంక్తి భోజనాలతో కోలాహలంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో సంఘ సభ్యులు అంబటి చంద్రమౌళి రొడ్డ సంపత్ ,ఇనుముల శ్రీనివాస్ ,అంబటి శివకుమార్ ,భేద సంపత్ ,గుండా కుమార్, రోడ్డ శ్రావణ్ ,రొయ్యల రాజకుమార్ ,జెల్ల శ్రీనివాస్ ,చరణ్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App