సీబీఎస్ఈ 10, 12 బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, పన్నెండవ తరగతి బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది.
Trinethram News : న్యూఢిల్లీ, ఫిబ్రవరి: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ను 86 రోజుల ముందుగానే బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను సీబీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
10, 12 తరగతులకు సన్నద్ధమైన విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ను సందర్శించి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు లేదా ఆయా పాఠశాలలు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App