TRINETHRAM NEWS

ప్రజలు మీకోసం పోర్టల్ ద్వారా సచివాలయాల్లో అర్జీలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు,

కలెక్టర్ పీ. ప్రశాంతి .

Trinethram News : ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య పిజిఆర్ఎస్,సెషన్‌లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని , ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17 న పీజీఆర్ఎస్ రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ జేశారు.

కావున సోమవారం ఫిబ్రవరి 17 వ తేదీ పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మీకోసం పోర్టల్ ద్వారా మీ సమీపంలో ఉన్న సచివాలయాల్లో అర్జీలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు.

ఫిబ్రవరి 27 వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా జిల్లా , డివిజన్, మండల స్థాయిలో సోమవారం పి జి ఆర్ ఎస్ సెషన్‌లు రద్దు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు (మార్చి 8 వ తేదీ వరకు) ఈ రద్దు అమలులో ఉంటుంది.

ఫిర్యాదుల నమోదు కోసం సమీపంలోని సచివాలయాన్ని సందర్శించండి. ఎన్నికల కోడ్ ఎత్తివేయబడే వరకు ఫిర్యాదులను సమర్పించడానికి “మీకోసం” ఆన్‌లైన్ పోర్టల్‌ని ఉపయోగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ సమాచారాన్ని తెలియ చెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. కావున ప్రజలు వ్యయ ప్రయాసలకు లోనుకాకుండా ఉండేందుకు, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పిజి ఆర్ఎస్ నిర్వహించడం, జరగనందున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అర్జీలు ఇవ్వడానికి కలెక్టిరేట్, డివిజన్, మండల కేంద్రాలకు రావద్దని తెలియ చెయ్యడం జరుగుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App