TRINETHRAM NEWS

నేడు సీఎం రేవంత్ రెడ్డి, అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 16
తెలంగాణ లో అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ఈరోజు ప్రారంభమయ్యాయి, వీటితోపాటు, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రి మండలి సమావేశం జరగనుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో .. కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్,బిల్లు, పంచా యతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.

అనంతరం ఈ బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు కూడా పంచాయతీ ఎన్ని కల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచా యతీరాజ్ చట్టానికి సవర ణలు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.

అలాగే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధి విధానాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది. ఫార్ములా– ఈ రేసింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటిఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరో వైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్, కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను కూడా కేబినె ట్‌లో చర్చించి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమ తించనుంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App