TRINETHRAM NEWS

C.A.M. Peddapally MLA Vijayaramana Rao who sent RF checks

నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చిన నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక సహాయం కింద సి.ఏం సహాయక నిధి చెక్కులను గురువారం రోజున ఓదెల మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హల్ లో ఓదెల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 147 మంది లబ్ధిదారులకు రూ.36,79,500 /- (ముప్పై ఆరు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల) విలువ గల సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణి చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

తదుపరి ఓదెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే గ

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ

ఓదెల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులను సిఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 36,79,500 /- (ముప్పై ఆరు లక్షల డేబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ) విలువ గల సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది అని అలాగే గత బి.అర్.ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫి పెద్ద బోగస్ అని విమర్శించారు..

పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా 1,50,000 వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగిందని మిగిలిన రైతులకు కూడా ఆగస్టు 15 తారీకు లోపు, రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మొత్తం మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు.

2014 సంవత్సరంలో ఏర్పాటైన బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని,టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో,రైతులు పండించిన వడ్లను రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కమిషన్ల రూపంలో రైతుల రక్తాన్ని తాగారని అన్నారు. దేశంలో ఉన్న బిజెపి పార్టీ కూడా ఏ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని, అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని అన్నారు. దాదాపు 31 వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు

త్వరలోనే నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

C.A.M. Peddapally MLA Vijayaramana Rao who sent RF checks