TRINETHRAM NEWS

Trinethram News : బహిరంగ సభకు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల నిర్వహణ బాధ్యత కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు అప్పగించడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో జరగబోయే బహిరంగ సభకు గద్వాల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి వేలాదిమంది ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు నాయకులు బస్సులలో బయలుదేరడం జరిగింది.

ఎమ్మెల్యే కూడా కార్యకర్తలతో కలిసి బస్సులో నల్గొండ సభకు ప్రయాణించారు .

ఎమ్మెల్యే మాట్లాడుతూ…

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర లో పదేళ్లు కెసిఆర్ పాలనలో సుభిక్షంగా ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రైతాంగానికి నీరు కరెంటు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ ని పేర్కొన్నారు .

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కృష్ణ జిల్లా ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. దీనివల్ల రైతాంగానికి సాగునీరు తాగునీరు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాలలో రైతులకు పెద్ద ఎత్తున నీటి సమస్య ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని కెసిఆర్ గ్రహించి కోసం ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమ చేశారు నేడు రాష్ట్రంలో హక్కుల కోసం మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైతుల కష్టసుఖాలు కెసిఆర్ అని తెలిపారు. ‌

కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బంది కరిగి పరిస్థితి తెచ్చే విధంగా మళ్లీ వెనక్కు వెళ్లే పరిస్థితి 60 ఏళ్ల కిందటకాలతో ఏ విధంగా ఉండే పల్లెలు రైతులకు నీళ్లు లేక విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ పరిస్థితి వచ్చే విధంగా పార్టీ చేసే పనిని బట్టి అర్థం మరొక 20 ఏళ్లు ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలందరూ వెనక్కి పోయే పరిస్థితి వస్తుంది. దీనికోసమే కృష్ణాజిల్లాలో ప్రాజెక్టులను ఒప్పందాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది.

కెసిఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ రాజారెడ్డి, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్స్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు రమేష్ నాయుడు, చక్రధర్ రావు, విక్రమ్ సింహారెడ్డి తూం కృష్ణ రెడ్డి, గద్వాల టౌన్ & అన్ని మండల పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.