BRS leaders arrested
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
బీ.ఆర్.ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన నేపథ్యం లో మాజీమంత్రి హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ బయల్దేరిన బీ.ఆర్.ఎస్ నాయకులను చొప్పదండి పోలీసులు అరెస్టు చేసి ఠాణా కు తరలించారు.తెల్లవారు జామునే మొదలైన అరెస్టుల పర్వం తో బీ.ఆర్.ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఒక ఎమ్మెల్యే పైనే దాడి చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ప్రశ్నిస్తే అరెస్టులు,నిరసన తెలిపితే అరెస్టులు పరిపాటిగా మారిపోయాయని,కాంగ్రెస్ సర్కారు తీరు మార్చుకోవాలని బీ.ఆర్.ఎస్ నాయకులు అన్నారు.
అరెస్టు అయిన వారిలో..పార్టీ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్,నలుమాచు రామకృష్ణ, ఇప్పనపెల్లి సాంబయ్య,మాచర్ల వినయ్,మాజీ మార్కెట్ ఛైర్మెన్ ఆరేళ్లి చంద్రశేఖర్,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి,మండల యూత్ అధ్యక్షుడు మారం యువరాజ్ కో- ఆప్షన్ ఎం. డీ అజ్జు,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు మావురం మహేష్, నరేష్ రావన్, పెద్దెల్లి అనిల్,గాండ్ల లక్ష్మణ్,పోరాండ్ల నితీశ్,చింటూ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App