
Trinethram News : శ్రీకాకుళం జిల్లా:ఫిబ్రవరి 24. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 23 తేదీ రాత్రి వరకు నిర్వహించడం జరిగింది.
అయితే రాత్రి నిర్వహించిన దేవదేవుని ఊరేగింపులో మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన వాసు దేవుని ఊరేగింపులో డిజె పాటలతో బ్రేక్ డాన్స్ లతో సాగింది..
డీజే శబ్దాల నడుమ, అత్యుత్సాహంతో కొంతమంది పూజారులు స్వామీజీల బ్రేక్ డాన్సులతో ఊరేగింపు నిర్వహించడం సర్వత్ర విమర్శనీయంగా మారింది. ఈ సంఘటన సాంప్రదాయాలను అవహేళన చేసే విధంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
