ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి ప్రమాణస్వీకారం
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఇటీవల స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన బొర్రా గోపీమూర్తి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ మోసేనురాజు తన కార్యాలయంలో గోపీమూర్తితో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు ఐ.వెంకటేశ్వరరావు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App