TRINETHRAM NEWS

Trinethram News : తూర్పు గోదావరి జిల్లా.. నల్లజర్ల మండలం పుల్లలపాడు లో బుడుపుల బాబ్జి, తాడిగడప సుదీర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డా.. నార్ని రత్నాలయ కుమారి వాలంటరీ బ్లడ్ సెంటర్ వారి ద్వారా శుక్రవారం రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు .

ఈ రక్త దాన శిబిరం లో సుదీర్, బాబ్జి లతో పాటు సుమారు 40 మంది వరకు తలసేమియా వ్యాధి తో బాధపడుతున్న రోగులకు రక్తo దానం చేసినట్లు సుదీర్, బాబ్జి లు తెలిపారు…

అన్ని సేవలలో కన్నా రక్త దానం చెయ్యడం ద్వారా ఎంత మంది తలసేమియా వ్యాధి తో బాధపడుతున్న చిన్నారుల సైతం ప్రాణాలను కాపాడవచ్చు అని బాబ్జి, సుదీర్ లు అన్నారు…

ప్రతి ఏటా కూడా ఇలాంటి సేవలను అందించడానికి తమ వంతు సహాయం గా ముందుకు వస్తామని వారు తెలిపారు..

ఈ నేపథ్యంలో రక్త దానం చేసిన వారికి బ్లడ్ బ్యాంక్ ద్వారా సర్టిఫికెట్లను జారీ చేసారు…

అనంతరం రక్తదానం చేసిన వారిని గ్రామస్తులు పలువురు అభినందించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

blood donation camp