
భారతీయ జనతా పార్టీ అంతర్గం మండల శాఖ అధ్యక్షులు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో
అంతర్గాం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బీజేపీ 45 వ ఆవిర్భావ వేడుకలు మండల కేంద్రం లోని బ్రాహ్మణ పల్లి ex రోడ్ మరియు గోలివాడ, బ్రాహ్మణ పల్లి,, ఎక్లస్పూర్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ ఇంచార్జి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాండ్ల ధర్మపురి హాజరై జెండా ఆవిష్కరణ చేసి, కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమై దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ ఆచరిస్తూ అటల్, అద్వానీ తదితర అగ్రనేతల మార్గదర్శనంలో అమిత్ షా , జేపీనాడ్డా నాయకత్వంలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలో భరతమాతను విశ్వ గురువుగా నిలిపే యజ్ఞంలో భాగమైన మనం అందరం కంకణ బద్దులై పని చేయాలి అని అన్నారు తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అని, రామగుండం లో కూడా బీజేపీ గెలుపు కొరకు కస్టపడి పని చేయాలని పిలుపు ఇచ్చారు
ఈ కాషాయ జెండా కోసం నక్షలైట్ తుపాకులకు కూడా బేధరకుండా సిద్ధాంతం కోసం పని చేసి తూటలకు బలి అయిన జెండా వీడకుండ ఉన్న మహనీయుల స్ఫూర్తి తో ప్రతి కార్యకర్త పని చేయాలి అని అన్నారు
ఈ కార్యక్రమం లో బీజేపీ అంతర్గం మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, బాలసాని సత్యం గౌడ్, మాడ అనిల్ రెడ్డి, ఆవుల విజయ్ పాల్,కొల్లూరి లక్ష్మణ్, తోటపల్లి సతీష్, మట్ట విష్ణు రెడ్డి,మాడ ప్రభాకర్ రెడ్డి, మీడివేల్లి అంజి, కొల్లూరి శ్రీకాంత్, హరీష్, శ్రీకాంత్, గద్దల మహేష్, తీగుట్ల నవీన్ తదితరులు పాల్గున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
