
త్రినేత్రం న్యూస్:మార్చి 29: నెల్లూరు జిల్లా: కావలి
కావలి నియోజకవర్గం
దగదర్తి మండలంలోని పలువురు వైసీపీ నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తురిమెర్ల పంచాయతీకి చెందిన గున్నం రెడ్డి హరికిషోర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే చెన్నూరు ఎంపీటీసీ చలంచర్ల సుశీలమ్మ, రంగసముద్రం సర్పంచ్ గంగవరపు మహేంద్ర, చెన్నూరు అరుంధతీయవాడ వైసీపీ నాయకుడు చెరుకూరు చెరుకూరు నాంచారి కొండయ్య, వారి అనుచరులు 30 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీ లో చేరారు.
శుక్రవారం దగదర్తి మండలం చెన్నూరు లో జరిగిన సభలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. పాత, కొత్త కలయికతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికల్లో భారీ విజయాలు సాధించే దిశగా కృషి చేయాలని నాయకులకు ఎమ్మెల్యే , సూచించారు. పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి చేజర్ల ఇబ్రిన్, టిడిపి నాయకులు జలదంకి శ్రీహరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
