TRINETHRAM NEWS

భారాస.. భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉంది: భట్టి విక్రమార్క

Trinethram News : 7th Jan 2024

ఖమ్మం: కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా మారిందని విమర్శించిన భాజపా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు..

భారాస, భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడారు. ‘నియంతృత్వ పాలకుల మీదే తిరుగుబాటు ఉంటుంది. మాది ప్రజాస్వామ్య పాలన..

మాపై తిరుగుబాటు ఉండదు. ఇప్పుడే ప్రజలు, అధికారులు స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉంటుంది. ఎవరిపైనా ఒత్తిడిలేని పాలన కొనసాగిస్తాం”అని భట్టి తెలిపారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రపంచీకరణకు అనుగుణంగా వర్సిటీలో కోర్సులు పెడతామని వివరించారు..