TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు జనగామ గ్రామంలో 64 67 బూతు అధ్యక్షులు ఇలుగురాళ్ల శివకుమార్ ఆధ్వర్యంలో45వ ఆవిర్భావ దినోత్సవా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బల్మూరి అమరేందర్రావు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొదట భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ అఖండ భారత్ స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నేతృతంలో గతంలో సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి అనేక సంస్కరణను రూపుమాపి 370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి నుండి విముక్తి కల్పించి

ఈ దేశంలో కాశ్మీర్ కూడా అంతర్భాగమే ఒక దేశంలో ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని శ్యాంప్రసాద్వీకరణ కలలను నెరవేర్చడం జరిగింది బిజెపి అంటే ముస్లిం వ్యతిరేక పార్టీ అని కుహనా లౌకికవాదులు చేస్తున్నటువంటి విమర్శలకు చెంపపెట్టుగా త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి దేశంలోని అనేక పేద ముస్లిం మహిళలకు అందరికీ ఈరోజు వారి కళ్ళలో ఆనందాన్ని చూడడం జరుగుతుంది. గత 500 సంవత్సరాలుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సవాలుగా మారిన సందర్భంలో అటు ముస్లింలకు గాని ఇటు హిందువులకు గాని ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా దేశంలో అత్యున్నత మైనటువంటి న్యాయస్థాన సుప్రీంకోర్టు ద్వారా రామాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.

దేశ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం అదేవిధంగా అట్టడుగు వర్గాల ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి చందన్ యోజన ఆవాస యోజనము కావచ్చు పేద ప్రజలకు మూడు పూటలా భోజనం చేయాలని ఉచిత రేషన్ బియ్యం పథకము ఎన్నో పథకాలను చేపట్టడం జరిగింది పార్టీ సిద్ధాంతం అయినటువంటి అంతియోదయ సిద్ధాంతాన్ని పురస్కరించుకొని దేశంలో అట్టడుగుల ఉన్నటువంటి ఎస్టీ జాతి నుండి శ్రీమతి ద్రౌపది ముర్మను రాష్ట్రపతిగా మరియు దళితులైన రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ ది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాదాపుగా అధిక సంఖ్యలో బడుగు బలహీన వర్గాలు కేంద్ర మంత్రులుగా గవర్నర్గా అనేక నామినేటెడ్ పోస్టులు ఇవాళ కొనసాగడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేశంలో వోక్స్వ చట్టాన్ని మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో రద్దుచేసి దేశంలో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాల అందరికీ అందరూ అభివృద్ధి చెందాలని ఆశయంతో నిరుపేద ముస్లిం మహిళల కోసం ఆ చట్టాన్ని రద్దుచేసి వారందరికీ చట్టం ద్వారా వచ్చేటువంటి నిధులందరి పేదవారికి అందుబాటు చెందాలని ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది.

అదేవిధంగా కేంద్రంలో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని దానికి నిదర్శనమే మొన్న జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలుపే నిదర్శనమని దాని కోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధులై దేశం కోసం ధర్మం కోసం నిర్విరామంగా శ్రమించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారులకు వచ్చే విధంగా శ్రమించాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనగాం మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య మామిడి వీరేశం వంగ రవి 67 64 బూత్ అధ్యక్షులు గుండబోయిన గట్టయ్య బీమా సుధీర్ రాజు రవి వెంకటేష్ బండారి శ్యామ్ అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bharatiya Janata Party celebrates