TRINETHRAM NEWS

Trinethram News : అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి వీధిలో వున్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద భారత్ బ్రాండ్ రైస్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని కావున ఈ అవకాశాని అవసరం ఉన్న వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు మీడియాకు వెల్లడించారు.