Trinethram News : Farmers Protest: నేడు భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా..
ఈ భారత్ బంద్ ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు మోడీ సర్కార్ దిగిరావాలని ఆందోళన చెపట్టేందుకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని రైతన్నలు సిద్ధమయ్యారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు.. ఈ భారత్ బంద్ లో పాల్గొని సక్సెస్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది..
నేటి ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. అలాగే, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు..
రైతులకు ప్రధానంగా ఆరు డిమాండ్లు ఉన్నాయి..
- పంటకు కనీస మద్దతు ధరకు చట్టం.
- రైతు రుణ మాఫీ.
- స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు.
- 2020 విద్యుత్ చట్టం ఉపసంహరణ.
- లఖింపుర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం.
- గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.
మరి రైతులు పిలుపునిచ్చిన